గోడను ఢీకొన్న విమానం, ప్రయాణికులు సేఫ్

గోడను ఢీకొన్న విమానం, ప్రయాణికులు సేఫ్

తమిళనాడులోని తిరుచ్చి నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ప్రహరీ గోడ ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణుకులెవరూ గాయపడలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 136 మంది ప్రయాణికులతో తిరుచి ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం దుబాయ్‌ బయల్దేరింది. టేకాఫ్ అవుతుండగా విమానం రెండు చక్రాలు ఏటీసీ ప్రహరీ గోడను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో ఉదయం 5.39 గంటలకు విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్‌ తరలించారు. ప్రమాద కారణాలపై కేంద్రమంత్రి సురేష్ ప్రభు దర్యాప్తునకు ఆదేశించారు.