ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో మంటలు

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా విమానంలోని పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్‌కో వెళ్లే 777 బోయింగ్ విమానంలోని ఏసీ యూనిట్ కు మరమ్మతులు చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. బోయింగ్ విమానానికి మరమ్మత్తులు జరుపుతుండగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని, ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.