'హలో.. ఆ విమానాన్ని హైజాక్‌ చేస్తున్నా..'

'హలో.. ఆ విమానాన్ని హైజాక్‌ చేస్తున్నా..'

ఎయిరిండియా విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ఓ ఆగంతకుడు గన్నవరం విమానాశ్రయానికి ఫోన్‌ చేసి బెదిరించడం కలకలం రేపింది. హైజాక్‌ చేసి ఆ విమానాన్ని గన్నవరం తరలిస్తానంటూ ఆ ఆగంతకుడు బెదిరించాడు. ఇది ఆకతాయి పనిగా పోలీసులు భావిస్తున్నారు. విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.   
ఇక.. ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేయనున్నట్లు ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్ సెంటర్‌కు నిన్న ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.  అధికారులు అప్రమత్తమై దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల దగ్గర భద్రతా అధికారులను అలర్ట్ చేశారు.