అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న 'ఎయిర్ ఇండియా వన్'...

అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న 'ఎయిర్ ఇండియా వన్'...

అమెరికా ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలోనే ఇండియా రాష్ట్రపతి, ప్రధాని కోసం రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు.  అమెరికాలోని బోయింగ్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తున్నది.  అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాలను తయారు చేస్తున్నారు.  బోయింగ్ 777 విమానాలలో మార్పులు చేసి వీటిని తయారు చేస్తున్నారు.  రెండు విమానాల్లో ఓ విమానం సిద్ధం కావడంతో దానిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కొంతమంది అధికారులు అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది.  ఈ విమానం అన్ని పరీక్షలు పూర్తి చేసుకుంది.  దీనికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.  త్వరలోనే ఈ విమానం ఇండియాకు రాబోతున్నది.  ఎయిర్ ఇండియా సంస్థ ఈ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగిస్తుంది. ఎయిర్ ఇండియా వన్ విమానం బాధ్యతలను ఐఏఎఫ్ చూసుకుంటుంది.