తిరుచ్చి విమాన ప్రమాదం.. పైలెట్లపై వేటు

తిరుచ్చి విమాన ప్రమాదం.. పైలెట్లపై వేటు

తిరుచ్చి ఎయిర్‌పోర్టులో గోడను ఎయిరిండియా విమానం ఢీకొట్టిన ఘటనలో పైలెట్లపై వేటు పడింది. ప్రమాదానికి వీరే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు.. వారిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. విమానం టేకాఫ్‌ సమయంలో గోడను ఢీకొట్టి విమానం ఆగిపోయింది. నిన్న తెల్లవారుజామున తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం దుబాయ్‌ బయలుదేరుతుండగా.. టేకాఫ్ సమయంలో ఎయిర్‌ పోర్టు కంపౌండ్ వాల్‌ను విమానం రెండు టైర్లు ఢీకొట్టాయి. విమానం యాంటెన్నీ దిబ్బతిన్నా.. కాసేపటికి మళ్లీ సిగ్నల్స్‌ అందడంతో విమానం టేకాఫ్‌ తీసుకుని ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ ల్యాండ్‌ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.