మరో రన్ వే పై దిగిన విమానం

మరో రన్ వే పై దిగిన విమానం

ఎయిర్ ఇండియా విమానం ఒకటి ఇంకా ప్రారంభించని రన్ వే పై దిగింది. రెండు టైర్లు పేలిపోయాయి. అయినా విమానంలోని 136 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మాల్దీవుల్లోని మాలే ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం తిరువనంతపురం నుంచి బయలుదేరి మాలే లోని వెలనా ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో దిగాల్సిన రన్ వే బదలు ఇంకా ప్రారంభం కాని రన్ వే పై దిగింది.  పొరపాటు గ్రహించిన పైలెట్లు వెంటనే బ్రేక్ వేయడంతో రెండు టైర్లు పేలిపోయాయి. అదృష్టవశాత్తు ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు పైలెట్లను తక్షణం విధుల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.