ఎయిరిండియా సర్వర్ సిస్టమ్ పునరుద్ధణ

ఎయిరిండియా సర్వర్ సిస్టమ్ పునరుద్ధణ

తమ సర్వర్ సిస్టమ్ పునరుద్ధరించినట్టు ఎయిరిండియా శనివారం ప్రకటించింది. ఐదు గంటలకు పైగా సర్వర్ పని చేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 155 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. 'ఎయిరిండియా సిస్టమ్ పునరుద్ధరించినట్టు' చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) అశ్వనీ లొహానీ రాయిటర్స్ వార్తాసంస్థ భాగస్వామి ఏఎన్ఐకి చెప్పారు. 'మా సర్వర్ సిస్టమ్ కుప్పకూలినందువల్ల ప్రపంచవ్యాప్తంగా మా కొన్ని ఫ్లైట్స్ ప్రభావితం అయినట్టు' ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ట్వీట్ చేసింది. విమానాల రాకపోకల్లో అంతరాయం కలిగినందుకు బాలీవుడ్ నటి గుల్ పనాగ్ సహా పలువురు ప్రయాణికులు ట్విట్టర్ లో తమ అసహనం వ్యక్తం చేశారు.