ముంబయి, కోల్ కతాకు ఎయిర్ ఇండియా కొత్త సర్వీస్

ముంబయి, కోల్ కతాకు ఎయిర్ ఇండియా కొత్త సర్వీస్

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని నడుపనుంది. 423 సీట్లున్న ఈ జంబో సర్వీస్ ను ముంబయి, కోల్‌కతా ప్రాంతాలకు నడపనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటించింది. బోయింగ్‌ 747 డబుల్‌ డెక్కర్‌ విమాన  అక్టోబర్‌ 16 నుంచి ఈ రెండు ప్రాంతాలకు సేవలు అందించనుంది. ఇందులో 12 సీట్లు ఫస్ట్‌ క్లాస్‌, 26 బిజినెస్‌, 385 ఎకానమీ సీట్లు ఉన్నాయి. అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు దిల్లీ నుంచి కోల్‌కతా, ముంబయి ప్రాంతాలకు రోజుకు ఒక విమానాన్ని ఆపరేట్‌ చేయనున్నారు. నాలుగు ఇంజిన్లతో ఉండే ఈ విమానాలను వీవీఐపీల కోసం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో ఉపయోగిస్తుంటారు. నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీ-ముంబయి-ఢిల్లీ సెక్టార్‌లో రోజుకు రెండు జంబో విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబరులో దసరా, నవంబరులో దీపావళి పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నారు.