ఎయిర్ ఇండియా ఆదాయం పెరిగిందోచ్...

ఎయిర్ ఇండియా ఆదాయం పెరిగిందోచ్...

గడచిన త్రైమాసికంలో ఆదాయం పెరిగిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. 2018 డిసెంబర్ త్రైమాసికంలో ప్రయాణీకుల నుంచి ఆదాయం సుమారు 20 శాతం పెరిగిందని తెలిపింది. అయితే... ప్రయణీకులు మాత్రం కేవలం 4శాతం మాత్రమే పెరిగినట్లు సంస్థ పేర్కొంది. ఇదంతా ఎయిర్ క్రాఫ్ట్ లను సమర్థంగా వాడుకోవటంతోనే జరిగిందని తెలిపింది. ప్రయాణీకుల నుంచి వచ్చిన ఆదాయం 2017-18 మూడో త్రైమాసికంలో రూ.4,615 కోట్ల ఆదాయం వచ్చింది. 2018-19 త్రైమాసికంలో రూ. 5,538 కోట్లు  పెరిగిందని అధికారులు తెలిపారు. గత సవత్సరంలో 53.28 లక్షల మంది ప్రయాణించగా... ఈ ఏడాది 55.27 లక్షల మంది ప్రయాణించారు.  ప్రయాణీకులు 4శాతం పెరిగారని లెక్కలు చెబుతున్నాయి. 

గత త్రైమాసికంలో సంస్థ 15కొత్త విమాన సర్వీసులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సంస్థ ఆదాయంలో 65శాతం అంతర్జాతీయ మార్గాల ద్వారా నుంచి లభిస్తోంది. ఎయిరిండియా దాదాపు రూ.48వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. గత ఏడాది మే నెలలో ప్రభుత్వం ఎయిరిండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రయత్నించి విఫలమైంది.