ఎయిర్ ఏషియా ఆఫర్... ప్రారంభ ధర రూ.999

ఎయిర్ ఏషియా ఆఫర్... ప్రారంభ ధర రూ.999

ఎయిర్ ఏషియా ఇండియా(ఏఏఐ)భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. అంతర్జాతీయ ఫ్లైట్లకు రూ.1,399 తో ఛార్జీలు ప్రారంభం కానున్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్ కు రూ.999 ప్రారంభ ధర. ఈ ఆఫర్ పరిమిత కాలంగా ఉంటుంది. ఎయిర్ ఏషియా గ్రూపునకు సంబంధించిన అన్ని  ఫ్లైట్లలో ఈ ఆఫర్ వర్థిస్తుంది. ఇవాళ అర్థరాత్రి నుంచి టికెట్లు బుక్ చేసుకునేందుకు విండో ఓపెన్ కానుంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే... వచ్చే సంవత్సరం  ఫిబ్రవరి 19 నుంచి నవంబర్ 26 మధ్యలో ప్రయాణం చేయవచ్చు. ఎయిర్ ఏషియా.కామ్, ఎయిర్ ఏషియా మొబైల్ ఆప్ ద్వారా టికెట్లు బుకింగ్ సౌకర్యం ఉంది. కౌలాలంపూర్, బ్యాంకాక్, సిడ్ని, ఆక్లాండ్ ,మెల్ బోర్న్ ,సింగపూర్, బాలి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఈ అవకాశాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది ఎయిర్ ఏషియా భావిస్తోంది. భారత్ లో  21 ప్రాంతాల నుంచి తన సర్వీసులను నడుపుతోంది.