కార్తీ చిదంబరానికి మరోసారి ఊరట

కార్తీ చిదంబరానికి మరోసారి ఊరట

ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిందంబరం కుమారుడు ఎంపీ కార్తీ చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ ఢిల్లీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు గడువు పొడగించింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ లావాదేవీల్లో అక్రమ నగదు చలామణి పేరిట చిదంబరం, ఆయన తనయుడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. చిదంబరంతో పాటు మరికొంతమందిని ఈ కేసులో ఈడీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ కోర్టు గతంలో మే 6న వరకు గడువు పొడగించింది. అయితే సీబీఐ, ఈడీలు తనను అరెస్ట్ చేయకుండా మరోసారి చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.