విమానాశ్రయంలో చంద్రబాబుకు చేదుఅనుభవం

విమానాశ్రయంలో చంద్రబాబుకు చేదుఅనుభవం

గన్నవరం విమానాశ్రయంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదుఅనుభవం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది చంద్రబాబును తనిఖీ చేశారు. ఆయన వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయితే, చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లేమార్గంలో పంపిస్తూ తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో లాంజ్ నుండి విమానం వరకూ ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించారు. వీఐపీ, జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవటం పట్ల టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.