ప్రభాస్ సినిమాలో ఎయిర్ టెల్ మోడల్ ..!!

ప్రభాస్ సినిమాలో ఎయిర్ టెల్ మోడల్ ..!!

బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో.  భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఇటీవలే యాక్షన్  మేకింగ్ వీడియో చాప్టర్ 1 ను రిలీజ్ చేశారు.  జేమ్స్ బాండ్, ఫాస్ట్ ఫ్యూరియస్ సినిమాలు ఎలా ఉంటాయో.. మేకింగ్ వీడియో అలాగే ఉన్నది.  దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఒకవైపు సాహో కంప్లీట్ చేస్తూనే.. ప్రభాస్ తన 20 వ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1970 కాలానికి చెందిన సినిమాగా తెరకెక్కుతున్నది.  ఇటీవలే ఇటలీలో ఈ సినిమా ప్రారంభమైంది.  యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారట.  పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎయిర్ టెల్ యాడ్ తో పాపులరైనా సాషా ఛెత్రి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తున్నది.  2020 లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.