కొత్త ప్లానుతో జియోకు ఎయిర్ టెల్ సవాలు

కొత్త ప్లానుతో జియోకు ఎయిర్ టెల్ సవాలు

కస్టమర్లను ఆకర్షించడంలో రిలయన్స్ కు, బీఎస్ఎన్ఎల్ కు పోటీగా నిలదొక్కుకునేందుకు ఎయిర్ టెల్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ మరో సరికొత్త ప్లాన్ ను ప్రారంభించింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ. 181 రీచార్జీతో వల వేస్తోంది. ఇప్పుడున్న రూ. 199 ప్లాన్లో మాదిరిగానే రూ. 181 లో కూడా 42జీబీ డాటా ఇస్తారు. అయితే ఈ రెండు ప్యాకేజీల్లో ఉన్న తేడా ఏంటంటే వ్యాలిడిటీ మాత్రమే. రూ.181 ప్యాకేజీ వ్యాలిడిటీ 14 రోజులైతే.. రూ. 199 లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.  దీంతో రూ. 200 రేంజ్ ప్యాకేజీల్లో రోజుకు 3జీబీ 4జీ డాటా ఇస్తున్న సరికొత్త ఆఫర్ ఎయిర్ టెల్ దే అవుతుంది. ఇక అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ యథా ప్రకారం వర్తిస్తాయి. 

ఎయిర్ టెల్ నుంచి రూ. 181 ప్లాన్.. రిలయన్స్ రూ. 198 కి, బీఎస్ఎన్ఎల్ రూ. 187 ప్లాన్ కి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.