ఎయిర్‌టెల్‌.. రూ.289 కొత్త ప్లాన్..

ఎయిర్‌టెల్‌.. రూ.289 కొత్త ప్లాన్..

టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ అనే సంబంధంలేకుండా వరుస ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ పోటీలో పలు ఆఫర్లు తెచ్చిన ఎయిర్‌టెల్‌.. తాజాగా తమ వినియోగదారులను సరికొత్త ఆఫర్‌ తెచ్చింది. రూ.289కి మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ప్లాన్ వాలిడిటీని 48 రోజులు.