ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్

ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్

దేశంలో దిగ్గజ టెలికమ్ ఆపరేటర్ ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్  ను ప్రకటించింది. రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ల నుంచి వస్తున్న గట్టి పోటీ ఎదురు కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తన ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం 299 రూపాయల ప్లాన్‌ ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద 45 రోజుల పాటు అపరిమితంగా వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందజేయనున్నట్టు ఎయిర్ టెల్ తెలిసింది. ఇప్పటి వరకు కాలింగ్‌లో రోజువారీ పరిమితులతో ఇబ్బంది పడ్డ వారికి ఇకపై పరిమితులను విధించడం లేదు. ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా.. కేవలం అపరిమిత కాలింగ్‌ ప్లాన్‌గానే దీన్ని తీసుకొచ్చింది.  ఇప్పటికే రూ.249, రూ.349 ప్లాన్లను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లపై అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, డేటా ప్రయోజనాలను కేవలం 28 రోజుల పాటు అందిస్తోంది. ఇటీవల రూ.1,199 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్‌ సమీక్షించింది. ఈ అప్‌గ్రేడేషన్‌తో అంతకముందు అందించే 90 జీబీ డేటా పరిమితిని, 120 జీబీకి ఎయిర్‌టెల్‌ పెంచింది.