బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్ 

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్ 

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రధాన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు నూతన ప్లాన్లను తీసుకువచ్చింది. ముఖ్యంగా డేటా ప్రయోజనాలతో పాటు, భారీ ఇన్సూరెన్సును కూడా అందిస్తోంది. రూ.249  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఎక్సా సంస్థలు ఆ పాల‌సీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. రూ.249 ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.  ప్లాన్‌  వాలిడిటీ 28 రోజులు. అంతేకాదు  ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సేవ‌లు, జీ5, లైవ్ చాన‌ల్స్‌, సినిమాలు, ఏడాదిపాటు నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవ‌లు, వింక్ సభ్యత్వం ఉచితంగా ల‌భిస్తాయి.