కేరళలో 1జీబీ డాటా, రూ.30 టాక్ టైమ్ ఫ్రీ

కేరళలో 1జీబీ డాటా, రూ.30 టాక్ టైమ్ ఫ్రీ

వరదలో మునిగిన కేరళలో తన కస్టమర్లకు చేతనైన సాయం చేసేందుకు ఎయిర్ టెల్ ముందుకొచ్చింది. బాధితులు తమ సమాచారాన్ని బంధువులకు, సహాయ సిబ్బందికి చేరవేసేందుకు వీలుగా 1జీబీ మొబైల్ డాటాతో పాటు రూ. 30 టాక్ టైమ్ ను క్రెడిట్ చేశారు. కేరళలోని ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. 

అయితే అందులో గొప్పేముంది? అందరూ చేస్తున్నదే కదా అని కొందరు పెదవి విరుస్తుండగా.. చేతనైన సాయం చేయడం మంచిదే కదా అని మరికొందరు ట్వీట్లు చేశారు.