రూ. 419 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన ఎయిర్ టెల్

రూ. 419 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన ఎయిర్ టెల్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. జియోను దీటుగా ఎదుర్కొనేందుకు రూ.419 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. 75 రోజుల కాలపరిమితి ఉన్న ఈ ప్లాన్‌ కింద వినియోగదారులకు రోజుకు 1.4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, నేషనల్ రోమింగ్ పై ఉచిత కాల్స్, ప్రతిరోజు లోకల్, ఎస్టీడీ కాల్స్ పై 300 నిమిషాలు, వారానికి వెయ్యి నిమిషాలు లభిస్తాయి. అలాగే ఎయిర్ టెల్ టీవీ యాప్ ను కూడా అందిస్తుంది. ఇతర టెలికం ఆపరేటర్స్ రూ. 399, రూ. 448 ప్రీపెయిడ్ ప్యాక్ లలో 1.4 జీబీ డాటా, అపరిమిత కాల్స్ తో 70, 82 రోజుల కాలపరిమితితో అందిస్తున్నాయి.

జియో రూ. 349 ప్లాన్ కు దీటుగా ఎయిర్ టెల్ రూ. 419 ప్యాక్ ను ప్రకటిచింది. జియో రూ. 349 స్కీమ్ లో రోజుకు 1.5 జీబీ డాటా, లోకల్, ఎస్టీడీ అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు, కాలపరిమితి 70 రోజులుగా ఉంది. అలాగే జియో అప్లికేషన్ లు పొందవచ్చు.

వీటితో పాటు ఎయిర్ టెల్ రూ. 35, రూ. 65, రూ. 95లతో మూడు చౌక రిచార్జ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. వీటిలో డాటాతో పాటు, ఫుల్ టాక్ టైం లను అందిస్తుంది. రూ.35 ప్లాన్ లో 100 ఎంబీ డాటా, రూ. 26.66 టాక్ టైం, కాలపరమితి 28 రోజులు, రూ. 65 ప్లాన్ లో 200 ఎంబీ డాటా, ఫుల్ టాక్ టైంతో పాటు 28 రోజుల కాలపరిమితి, ఇక రూ.95 ప్లాన్ లో 500 ఎంబీ డాటా, ఫుల్ టాక్ టైం, 28రోజుల కాలపరిమితి నిర్ణయించారు.