ఇదీ జియో ఎఫెక్టే..! తగ్గిన ఫోన్‌కాల్స్‌ రింగింగ్ టైం..

ఇదీ జియో ఎఫెక్టే..! తగ్గిన ఫోన్‌కాల్స్‌ రింగింగ్ టైం..

టెలికం రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యర్థులకు వివిధ కోణాల్లో చుక్కలు చూపిస్తోన్న రిలయన్స్ జియో ఎఫెక్ట్ ఇప్పుడు ఫోన్ కాల్స్ రింగింగ్ సమయంపై కూడా పడిందట... సాధారణంగా ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ, ఆ సమయంలో 25 సెకన్లకు కుదించాయి. దీనిపై తాజాగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటన చేశాయి.. అయితే, ఈ నిర్ణయం వెనుక జియోనే ఉందనే టాక్ ఉంది. తాజాగా జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్ని మొదట 20 సెకన్లకు కుదించింది.. విమర్శలు రావడంతో మరో 5 సెకన్లు జోడించి ఆ సమయాన్ని 25 సెకన్లు పెంచింది. ఇక, జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఆ సమయాన్ని 25 సెకన్లకు కుదించేశాయి. ఐయూసీ చార్జిలను ఎక్కువగా చెల్లిస్తున్నందువల్లే ఆ ఖర్చును తగ్గించుకోవడానికి రింగింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు కుదించిందని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆరోపిస్తున్నాయి.