మేఘాలను చుట్టేసుకుంది

మేఘాలను చుట్టేసుకుంది

ఐశ్వర్య రాయ్ బచ్చన్ మాజీ విశ్వసుందరి... వయసు పెరుగుతున్నా... అందంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. నిత్యా యవ్వనంగా కనిపిస్తుంది.  ఇంతటి అందం ఎలా వచ్చింది.. కారణం ఏంటి అంటే ఎప్పుడు సంతోషంగా ఉండటమే అని చెప్తోంది.  ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూసి అనవసరంగా అలోచించి సమయాన్ని వృధా చేసే బదులుగా... సమస్య ఏంటో కనుక్కొని పరిష్కారం దొరకపుచ్చుకుంటే సరిపోతుంది.  

ఎక్కడికి వెళ్లినా కూతురు ఆద్యను వెంటబెట్టుకొని వెళ్తుంది.  ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో  పాల్గొంది.  అక్కడ రెడ్ కార్పెట్ పై డిజైనర్ డ్రెస్ తో తళుక్కున మెరిసింది.  మొదటిరోజు గోల్డెన్ సిల్వర్ డ్రెస్ తో అదరగొట్టిన ఐష్, రెండోరోజు వైట్ కలర్ డ్రెస్ తో మెరుపులు మెరిపించింది. తెల్లని మేఘాలను డ్రెస్ లా డిజైన్ చేసి అలంకరించినట్టుగా ఉన్నది ఆ డ్రెస్... తెల్లని ఆ డ్రెస్ లో దేవకన్యలా అద్భుతంగా ఉంది. ఎంతైనా మాజీ విశ్వ సుందరి కదా.