ఐష్ కు కోపం తెప్పించిన అభిషేక్ హగ్..!!

ఐష్ కు కోపం తెప్పించిన అభిషేక్ హగ్..!!

ఐశ్వర్య రాయ్ బచ్చన్ వివాహం తరువాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.  ఐష్ భర్త అభిషేక్ కూడా సినిమా రంగంలో బిజీగా ఉన్నారు.  కూతురు ఆధ్య స్కూల్ వయసు రావడంతో ఆ హడావుడి మొదలైంది.  ఐష్ కెరీర్ స్టార్టింగ్లో సల్మాన్ తో ప్రేమలో పడింది.  ఇద్దరు ప్రేమించుకున్నారు.  ఏమైందో ఏమో తెలియదు.. ఐష్ సల్మాన్ ను పక్కనపెట్టింది.. వివేక్ ప్రేమలో పడింది.  

ఇద్దరు ఘాడంగా ప్రేమించుకున్నారు.  ఇక పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.  అదే సమయంలో అభిషేక్ బచ్చన్ ఐష్ కు ప్రపోజ్ చేశారు.  ఆ తరువాత చకచకా అన్ని మారిపోయాయి.  ఐష్.. అభిషేక్ పెళ్లి చేసుకున్నారు.  అయితే, ఇటీవలే సింధు సన్మాన సభలో అభిషేక్.. వివేక్ ఒబెరాయ్ లు ఎదురుపడ్డారు.  ఒకరినొకరు పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు.  కాగా, ఇది ఐష్ కు నచ్చలేదట.  ఎన్నికల సమయంలో వివేక్ ఒబెరాయ్ ఐష్ గురించి తప్పుగా మాట్లాడుతూ ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పి ట్వీట్ తొలగించాడు.  కాగా, ఇప్పుడు అభిషేక్ బచ్చన్.. వివేక్ లు ఒకరికొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో ఐష్ కోపంగా ఉందని సమాచారం.