ఐష్ బీట్ చేయలేకపోయింది..

ఐష్ బీట్ చేయలేకపోయింది..
ట్విట్టర్, పేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల కంటే సెలెబ్రిటీలు ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతుంటారు.  వారికి సంబంధించిన ఫోటోలు, ఇన్ఫర్మేషన్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటారు.  ఇంస్టాగ్రామ్ లో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటె అంత క్రేజ్.  మలయాళం బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇంస్టాగ్రామ్ లో దూసుకుపోతున్నది. ఒరు అడార్ లవ్ సినిమాలోని మాణిక్య మలరా అనే పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.  సోషల్ మీడియా విషయంలో ప్రపంచంలోని టాప్ సెలబ్రిటీస్ కె షాక్ ఇచ్చే రేంజ్ కి ఎదిగింది. 
 
ఇండియాలో వన్నె తరగని అందం ఎవరి సొంతం అంటే టక్కున ఐశ్వర్యా రాయ్ అని చెప్తారు.  అలాంటి ఐశ్వర్య రాయ్ ఇటీవలే సోషల్ మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో చేరింది.  ఐశ్వర్య రాయ్ ఇంస్టాగ్రామ్ లో చేరిన మొదటి 24 గంటల్లో లక్షా ఆరువేల మంది ఫాలో అయ్యారు.  ఇది మంచి సంఖ్యే కానీ, ప్రియా వారియర్ తో పోలిస్తే మాత్రం చాలా వెనకబడి ఉందని చెప్పొచ్చు.  
 
ప్రియా వారియర్ ఇంస్టాగ్రామ్ లో చేరిన 24 గంటల్లో ఆరు లక్షల మంది ఫాలోవర్స్ మార్క్ ను అందుకుంది.  ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను అందుకున్న సెలబ్రిటీలలో ప్రియా వారియర్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది.  అమెరికన్ మోడల్ కైలీ జన్నర్, ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిష్టియానో రోనాల్డో తరువాత స్థానంలో నిలిచింది.