మెగా టీమ్ కు షాక్ ఇచ్చిన ఐష్..!!

మెగా టీమ్ కు షాక్ ఇచ్చిన ఐష్..!!

బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు ఐశ్వర్యారాయ్.  ఈ హీరోయిన్ అనేక సినిమాలు చేసింది.  1994 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.  దీంతో ఐష్ పై బాలీవుడ్ కన్ను పడింది.  ఐష్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ మొత్తం ప్రయత్నించింది.  

కానీ, బాలీవుడ్ కంటే ముందు ఆమె మణిరత్నం ఇరువరన్ అనే సినిమాలో చేసింది.  ఇది తెలుగులో ఇద్దరు గా రిలీజ్ అయ్యింది.  ఆ తరువాత శంకర్ దృష్టిలో పడిన ఈ టాప్ హీరోయిన్ జీన్స్ లో నటించింది.  అప్పటి నుంచి బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కి వెళ్ళింది.  తెలుగులో ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నించారు.  కానీ లాభం లేకపోయింది.  ఐష్ తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.  నాగార్జున రావోయి చందమామ సినిమాలో ఓ సాంగ్ చేసింది అంతే.  

మెగాస్టార్ కొరటాల కాంబినేషన్లో ఐష్ తో సినిమా చేయాలని అనుకున్నారు.  దానికోసం ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.  ఐష్ రెమ్యునరేషన్ భారీగా చెప్పిందట.  అంతేకాకుండా తన పర్సనల్ కోరికలు భారీగా ఉండటంతో మెగాస్టార్ యూనిట్ షాక్ అయ్యింది.  బాలీవుడ్ లో కూడా ఆమెకు పెద్దగా సినిమాలు లేవు.  ఈ సమయంలో ఆమెతో ఎందుకులే అనుకుంటున్నారట మెగా టీమ్.