చిరు 152 లో ఐశ్వర్య... నయన్ ను పక్కన పెట్టారా?

చిరు 152 లో ఐశ్వర్య... నయన్ ను పక్కన పెట్టారా?

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  ప్రస్తుతం 152 వ సినిమాకు సంబంధించిన మూవీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా తీసుకున్నారు.  

అయితే, ఏమైందో ఏమో తెలియదు.  సడెన్ గా ఐశ్వర్యారాయ్ పేరు తెరమీదకు వచ్చింది.  ఐశ్వర్యారాయ్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇందులో చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉంటుంది. అందుకే ఐష్, నయన్ లు ఇద్దరినీ తీసుకుంటున్నారా లేక నయన్ ను పక్కన పెట్టి ఐష్ ను మాత్రమే ఉంచుతారా అన్నది తెలియాలి.  రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మాట్నీ మూవీ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నది.