విలన్ పాత్రలో ఐశ్వర్యరాయ్ !

విలన్ పాత్రలో ఐశ్వర్యరాయ్ !

తమిళ దర్శకుడు మణిరత్నం చేస్తున్న హిస్టారికల్ మూవీలో ఐశ్వర్యరాయ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తోంది.  ఇటీవలే ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.  ఇందులో ఆమెది నెగెటివ్ పాత్రట.  అంటే విలన్ పాత్రన్నమాట.  ఆమె పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.  చోళ రాజుల కాలంలో నడిచే ఈ కథను తమిళ పాపులర్ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా రూపొందించారు మణిరత్నం.  ఇందులో విజయ్ సేతుపతి, జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్ కూడా నటించనున్నారు.  ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.