ఐష్ నెగెటివ్ రోల్ చేస్తోందా..?

ఐష్ నెగెటివ్ రోల్ చేస్తోందా..?

ఐశ్వర్య రాయ్ ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.  అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న తరువాత కూడా ఐష్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది.  గతంలో సౌత్ సినిమాల్లో మెరిసిన ఈ హీరోయిన్ ఇప్పుడు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కావడం విశేషం.  

సౌత్ లో మణిరత్నం సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది.  మణి సినిమాలు హృదయాలను హత్తుకునే విధంగా ఉంటాయి.  నయగన్, దళపతి, రోజా, బొంబాయి వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు.  పొన్నియన్ సెల్వం పుస్తకం ఆధారంగా మణిరత్నం ఓ భారీ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.  విజయ్, శింబు, విక్రమ్ లు ఇందులో నటిస్తున్నారు.  కాగా, ఈ సినిమాలో ఐష్ కూడా ఓ ప్రముఖ పాత్ర చేస్తున్నట్టు సమాచారం.  ఇందులో ఐశ్వర్య రాయ్ నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.