రానాకు నో చెప్పిన యువ హీరోయిన్..?

రానాకు నో చెప్పిన యువ హీరోయిన్..?

టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రాన్ని రానా దగ్గుపాటితో కలిసి చేస్తున్నారు. ఈ సినిమా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు నాచురల్ బ్యూటీ సాయిపల్లవిని సంప్రదించగా ఆమె సినిమాను రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. దాంతో మూవీ మేకర్స్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను సంప్రదించారంట. ఈ సినిమా పవన్, రానాలకు హీరోయిన్‌ పాత్ర కోసం చర్చలు జరిపారని, కానీ ఐశ్వర్య రాజేష్ కూడా సినిమాకు నో చెప్పారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో చేస్తుండగా రానా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.