బాలీవుడ్ పై ఆధారపడుతున్న మెగాస్టార్..!!

బాలీవుడ్ పై ఆధారపడుతున్న మెగాస్టార్..!!

మెగాస్టార్ 151 వ సినిమా సైరాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు.  సినిమా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని రివ్యూలు వచ్చాయి.  ఆల్బమ్ కు కూడా మంచి పేరు వచ్చింది.  ఈ సినిమా తరువాత ఇటీవలే మెగాస్టార్ 152 వ సినిమా కొరటాల దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది.  నవంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కాబట్టి తప్పనిసరిగా సామాజిక కోణంలో సినిమా ఉంటుంది.  

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దేవాలయాలకు సంబంధించిన సమస్యల చుట్టూ ఉండబోతుందని తెలుస్తోంది.  ఇకపోతే, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లుగా బాలీవుడ్ ద్వయం అజయ్.. అతుల్ లను తీసుకోబోతున్నారని సమాచారం. ఈ ద్వయం 2004 నుంచి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. నటరంగ్, సింగం, అగ్నిపీట్, బోల్ బచ్చన్, పీకే, బ్రదర్స్, ధఢక్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, సూపర్ 30 వంటి అనేక సినిమాలకు మ్యూజిక్ అందించారు.  బాలీవుడ్ లో పాపులర్ అయిన ఈ మ్యూజిక్ ద్వయం.. ఇప్పుడు మెగాస్టార్ 152 వ సినిమాకు సంగీతం అందించబోతున్నారని తెలుస్తోంది.