వర్మకు భారతరత్న ఇవ్వాలట..!!?

వర్మకు భారతరత్న ఇవ్వాలట..!!?

దేశంలో వివాదాస్పద దర్శకుడు ఎవరు అంటే అందరు చెప్పేమాట ఒక్కటే.. రామ్ గోపాల్ వర్మ అని.  వర్మ సినిమాలు ఎలా ఉంటాయో.. అయన స్టేట్మెంట్ లు కూడా అలాగే ఉంటాయి.  ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో.. ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఎవరికీ అర్ధంగాడు. ఈ దర్శకుడు ఎంతో మంది దర్శకుడులకు లైఫ్ ఇచ్చాడు.  వర్మ స్కూల్ నుంచి వచ్చిన చాలా మంది ఇండియన్ ఇండస్ట్రీలో దర్శకులుగా నిలబడ్డారు.  

ఎంతో మందికి స్ఫూర్తిని, లైఫ్ ను ఇచ్చిన వర్మకు భారత ప్రభుత్వం నుంచి ఒక్క అవార్డు కూడా రాలేదు.  దీంతో వర్మ శిష్యుడు అజయ్ భూపతి విచారం వ్యక్తం చేస్తూ.. వర్మకు భారత రత్న ఇవ్వాలని అంటూ ట్వీట్ చేశాడు.  అజయ్ భూపతి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  అజయ్ ట్వీట్ పై ఆర్ ఎక్స్ 100 హీరో స్పందించాడు.  గురువులాగే శిష్యుడు కూడా ఉన్నాడని సరదాగా ట్వీట్ చేశాడు.  కొందరేమో వర్మను విమర్శించినట్టుగానే విమర్శిస్తే.. మరికొందరు మాత్రం అజయ్ భూపతికి సపోర్ట్ చేస్తూ.. వర్మ సినీ రంగానికి ఎన్నో సేవలు అందించాడని, వర్మ భారత  రత్నకు అర్హుడే అంటూ ట్వీట్ చేశారు.  మొత్తానికి శిష్యుడు చేసిన ట్వీట్ ట్విట్టర్లో సంచలనంగా మారింది