జక్కన్న సలహాలు తీసుకుంటున్న బీటౌన్ హీరో..

జక్కన్న సలహాలు తీసుకుంటున్న బీటౌన్ హీరో..

టాలీవుడ్ దర్శధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇందులో కీలక పాత్ర చేయనున్నాడు. అయితే దీనితో పాటు అజయ్ తన స్వీయ దర్శకత్వంలో మేడే అనే సినిమాను చేసేందుకు చూస్తున్నాడు. అందులో బాలీవుడ్ బిగ్‌బీ, రకుల్ ప్రీత్‌సింగ్‌లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా లొకేషన్స్, సెట్టింగ్స్ విషయంలో అజయ్ చాలా మందితో చర్చలు చేశాడు. అందులో భాగంగా అజయ్ దేవగన్ తన సినిమాకు కావాల్సిన వాటి గురించి జక్కన్నను సంప్రదించారు. అందుకు గాను రాజమౌళ అజయ్‌కి కావలసిన సెట్టింగ్‌లను సిబు సైరల్ నిర్మిస్తాడని అదేవిధంగా కావాల్సిన సెట్టింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పాడు. దాంతో అజయ్ దేవగన్ తన సినిమాను హైదరాబాద్‌లో చేసేందుకు సిద్దమవుతున్నాడు. అంతేకాకుండా తన సినిమాకు కావలసిన సెట్టింగ్ వర్క్‌ను సిబు సైరల్‌తో కలిసి ప్రారంభించాడు. ఇక మేడే చిత్రీకరణ మొదలు చేసేందుకు అజయ్ రెడీ అవుతున్నాడు.