పట్టాలెక్కుతున్న థాంక్ గాడ్.. ఎప్పుడంటే..

పట్టాలెక్కుతున్న థాంక్ గాడ్.. ఎప్పుడంటే..

బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం థాంక్‌ గాడ్. ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హిందీ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించనుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని హిందీ చిత్ర సీమలోని ప్రధాన క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ వేదికగా తెలిపారు. దాంతో పాటుగా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఈ సినిమాను టీ సిరీస్, మారుతి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై భూషన్ కుమార్, కృష్ణ కుమార్, అశోక్ థాకేరియా, సునిర్ ఖేటర్పాల్, దీపక్ ముకుత్, ఆనంద్ పండిట్, మార్ఖండ్ అధికారి తదితరులు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. అయితే హిందీ సినిమాల్లో మొట్టమొదటి సారి సిధార్ధ, అజయ్ దేవగన్‌లు ఒకే తెరపై కనిపించనున్నారు. రకుల్ వీరిద్దరికీ జంటగా కొన్ని సినిమాలను ఇప్పటికే తెరకెక్కించారు. అయితే థాంక్ గాడ్ సినిమా ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్. అంతేకాకుండా ఓ మెసేజ్ ఇచ్చే విధంగా సినిమా కథ ఉంటుంది. అజయ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వారితో పాటు యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్స్ రకుల్, సిద్దార్థ్‌తో పనిచేయడం నాకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు సిద్దార్థ్ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆంఖే 2, మిషన్ మజ్ను, షేర్షా  సినిమాలు చేస్తున్నాడు. వీటిలో షేర్షా సినిమా జులై 3న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.