మరోసారి ప్రధాన పాత్రలో విలన్ అజయ్ !

మరోసారి ప్రధాన పాత్రలో విలన్ అజయ్ !

విలన్లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన నటులు చాలా మందే ఉన్నారు.  పరిశ్రమలో అగ్రస్థానాన్ని అలంకరించిన చిరంజీవి, మోహన్ బాబులు అలా వచ్చినవాళ్లే.  ఇప్పుడు వారి మాదిరిగానే నటుడు అజయ్ కూడా వెళుతున్నాడు.  నెగెటివ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అప్పుడప్పుడు పాజిటివ్ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. 

ఇప్పుడాయన ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందింది.  అదే 'స్పెషజల్'.  ఒక మైండ్ రీడర్ కథగా ఈ సినిమా ఉండనుంది.  ఈ చిత్రాన్ని వాస్తవ్ డైరెక్ట్ చేయగా నందలాల్ క్రియేషన్స్ నిర్మించింది.  ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలైంది.  అజయ్ గతంలో కూడ 'సారాయి వీర్రాజు' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.