మంత్రుల వ్యక్తిగత సిబ్బంది ఎంపిక జగన్ దృష్టి

మంత్రుల వ్యక్తిగత సిబ్బంది ఎంపిక జగన్ దృష్టి

మంత్రుల వ్యక్తిగత సిబ్బంది ఎంపిక, నియామకాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం లేఖ రాశారు. మంత్రుల పేషిలలో సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలని ఆ లేఖలో సూచించారు. గత ప్రభుత్వంలో మంత్రుల పేషీల్లో పని చేసిన పర్సనల్‌ సెక్రటరీలు, అడిషనల్‌ పర్సనల్‌ సెక్రటరీలు, ఓఎస్‌డీలను కొత్త మంత్రులు నియమించుకోవదని సూచించారు.