వన్డే క్రికెట్ మళ్ళీ ఆడుతా... 

వన్డే క్రికెట్ మళ్ళీ ఆడుతా... 

భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఒక్కపుడు జట్టుకు అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కానీ తర్వాత మెళ్లిగా టెస్ట్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. అయితే తాను మళ్ళీ వన్డే జట్టులోకి వస్తాను అని తనకు నమ్మకం ఉన్నట్లు రహానే తెలిపాడు. ఫిబ్రవరి 2018 నుండి అజింక్య వన్డే మ్యాచ్ ఆడలేదు. అయితే  50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ 4 వ స్థానంలో ఆడిన రహానే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా రాణించాడు. 'నేను వన్డేలో ఏ స్థానం లోనైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ఓపెనింగ్ లేక 4 వ స్థానం ఏదైనా సరే నేను సిద్ధం. నేను మళ్ళీ ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడగలను అని నాకు తెలుసు. కానీ ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియదు. అయితే ఆవకాశం ఎప్పుడు వచ్చిన నేను ఆడటానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాను'' అని రహానే తెలిపాడు.