కరోనా పై  పోరాటానికి విరాళం ప్రకటించిన భారత టెస్ట్ వైస్ కెప్టెన్...

కరోనా పై  పోరాటానికి విరాళం ప్రకటించిన భారత టెస్ట్ వైస్ కెప్టెన్...

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం కోసం భారత టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అజింక్య రహానె మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ .10 లక్షలు విరాళంగా ఇచ్చారు. అయితే కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి సహకరించిన క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు రహానె కూడా చేరుకున్నాడు. అయితే ఇప్పటికే కరోనా పోరాటానికి లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రూ .50 లక్షలు, సురేష్ రైనా రూ .52 లక్షలతో విరాళంగా ఇచ్చారు. అయితే మన దేశం లో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. కరోనావైరస్ నవలతో పోరాడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 186 నమోదుకాగా 6 మరణాలు సంభవించాయి. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వచ్చే నెల 15 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.