టీ 20ల్లో ఎలా ఆడాలో నాకు ద్రవిడ్  చెప్పాడు... 

టీ 20ల్లో ఎలా ఆడాలో నాకు ద్రవిడ్  చెప్పాడు... 

అజింక్య రహానె టెస్ట్ లో నమ్మదగిన ఆటగాడిగా తన స్థానాన్ని పరిమితం చేసుకున్నాడు. 42 కంటే ఎక్కువ సగటున ఈ పొడవైన ఫార్మాట్‌లో 4203 పరుగులు చేశాడు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం చోటు దక్కించుకో లేకపోతున్నాడు రహానె. అయితే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రాహుల్  ద్రవిడ్ మెంటర్‌షిప్ కింద రహానే ఆడాడు. ఆ సమయం లో టీ 20 ఫార్మాట్‌లో ఎలా ఆడాలిఅనేది ద్రవిడ్ తనకు చెప్పినట్లు తెలిపాడు. ఆయన నాకు '' ఈ పొట్టి ఫార్మాట్ లో ఆడుతున్నప్పుడు కేవలం పరుగులపైనే దృష్టి పెట్టాలి, తప్ప షాట్లు ఎలా ఆడుతున్నామో దాని గురించి ఆలోచించవద్దని ద్రవిడ్ తనకు సలహా ఇచ్చినట్లు ఈ ముంబై బాట్స్మెన్ చెప్పాడు. ఆడే షాట్లు బాగా కనిపించవు అని చూడకూడదు,    కేవలం బంతిని చూడాలి, కొట్టాలి అంతే అని భారత మాజీ కెప్టెన్ తనకు చెప్పాడని రహానె అన్నాడు. అజింక్య రహానె ఇప్పటివరకు 111 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు, ఇందులో 33.59 సగటుతో 3,057 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, 25 యాభైలను ఉన్నాయి.