బౌలర్లు వికెట్లు తీస్తే ఇక పై వారికి అది చేయాలి : రహానే

బౌలర్లు వికెట్లు తీస్తే ఇక పై వారికి అది చేయాలి : రహానే

ఇప్పుడు అందరిని అని దేశాలను భయపెడుతుంది కరోనా. ఈ వైరస్ ఎఫెక్ట్ ప్రస్తుతం క్రీడారంగం పై పడుతుంది. ఇప్పటికే దీని కారణంగా ఈ సంవత్సరం అని క్రీడా టోర్నీలు  వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ కరోనా భయం క్రికెట్ ఆటగాళ్లపై కూడా పడింది. అందకే ఇక నుండి మేము మిగితా ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వం అంటున్నారు ప్లేయర్స్. అయితే ఈ విషయం పైన స్పందించిన భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టాడు. అయితే ఆటలో భాగంగా ఏ బౌలర్ అయిన సరే వికెట్ తీస్తే వారికి మన భారత సంప్రదాయ ప్రకారం నమస్కరం పెట్టాలి అని తెలిపారు. అలా చేయడం వలన ఈ వైరస్ వ్యాప్తిని తప్పకుండ అడ్డుకోవచ్చు అని అన్నాడు. అయితే ఇప్పటికే ఆటలో బంతి పై చెమట, లాలాజలం ఉపయోగించ కుండా బంతిని స్వింగ్ చేయడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజులో క్రికెట్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి అనేది.