ప్రత్యర్థి బౌలర్‌‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రహానే...

ప్రత్యర్థి బౌలర్‌‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రహానే...

ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ అనంతరం టీం ఇండియా ప్రత్యర్థి బౌలర్‌‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. భారత ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్‌కు బహుమతిగా అందించింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో భారత కెప్టెన్ అజింక్యా రహానే ఈ బహుమతిని లయన్‌కు అందజేశాడు. అయితే భారత్ తో ఆడిన చివరి గబ్బా టెస్ట్ లయన్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ విధంగా టీమిండియా సర్‌ప్రైజ్ చేసింది. అయితే లయన్‌కు భారత ఆటగాళ్లు గిఫ్ట్ ఇవ్వడాన్ని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారత జట్టును, కెప్టెన్ రహానేను మెచ్చుకున్నాడు. భారత ఆటగాళ్ల క్రీడాస్పూర్తి పట్ల అభిమానులు కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది.