రహానేకు గోల్డెన్‌ ఛాన్స్‌

రహానేకు గోల్డెన్‌ ఛాన్స్‌

టీమిండియా ఆటగాడు అజింక్య రహానేకు గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది. ఇంగ్లీష్‌ కౌంటీల్లో ఆడేందుకు అతనికి అవకాశం లభించింది. ఈ మేరకు హ్యాంప్‌షైర్‌తో రహానె ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం హ్యాంప్‌షైర్‌ తరఫున ఆడుతున్న గెస్ట్‌ ప్లేయర్స్‌ మార్క్‌రమ్‌, దిముత్‌ కరుణరత్నేలు వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆ లోటును రహానేతో భర్తీ చేయాలని భావిస్తున్న హ్యాంప్‌షైర్‌.. ఒప్పందం కుదుర్చకుంది.  కౌంటీల్లో ఆడేందుకు అవకాశం రావడంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు. ఇండియా తరఫున 56 టెస్టులాడిన రహానే 3,488 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలున్నాయి. 90 వన్డేల్లో 2,962 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలున్నాయి.