ఆజింక్య రహానే స్పూర్తిదాయక స్పీచ్‌...

ఆజింక్య రహానే స్పూర్తిదాయక స్పీచ్‌...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత భారత ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. అనంతరం కోచ్ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లను పేరుపేరున ప్రశంసించారు. ఈ క్రమంలోనే జట్టు కెప్టెన్ ఆజింక్య రహానే కూడా స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసింది. తొలి మ్యాచ్ ముగిసిన తరువాత మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ ఆటగాళ్లంతా ప్రాణం పెట్టి ఆడారని రహానే ఆభినందించాడు. 'ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. తొలి మ్యాచ్ తరువాత ప్రతి ఒక్క ఆటగాడూ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నాడు.