పాక్ నిర్ణయంపై అజిత్ దోవల్ రియాక్షన్..క్షణాల్లో వైరల్..

పాక్ నిర్ణయంపై అజిత్ దోవల్ రియాక్షన్..క్షణాల్లో వైరల్..

కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ మండిపడుతోంది. కాశ్మీర్ హక్కులను కాలరాస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతోంది.  అంతర్జాతీయ వేదికపైన కంప్లైన్ట్ చేస్తామని బెదిరిస్తోంది.  అంతటితో ఆగకుండా ఇండియాతో వాణిజ్య ఒప్పందాలన్ని రద్దుచేసుకుంటున్నట్టు ప్రకటించింది.  పాక్ లో ఇండియా సినిమాలను బ్యాన్ చేసింది.  ఇండియా.. పాక్ లమధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను వాఘా సరిహద్దు వద్దకు రాగానే నిలిపివేసింది.  తమ భూభాగంలోకి అడుగుపెట్టనివ్వమని చెప్పింది.  

పాక్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ స్పందించారు.  ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం వలన ఇండియాకు చాల నష్టం వస్తుందని.. ఆ నష్టం ఎంత అంటే.. విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో ఓ ప్రమోషనల్ పోస్ట్ కోసం ఎంత తీసుకుంటాడో అంత నష్టం వస్తుందని చమత్కరించారు.  వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఇండియాకు పెద్దగా నష్టం లేదని, ఆ దేశమే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.  అజిత్ దోవల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.