రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి..అస్వస్థతో కన్నుమూత...!

రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి..అస్వస్థతో కన్నుమూత...!
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (74) కన్నుమూశారు. గత 20 రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిన అజిత్ జోగిని కుటుంబ సభ్యులు రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు. అజిత్ జోగి మరణవార్తని ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్ లో తెలిపారు. స్వస్థలమైన గౌరెల్లలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

 చత్తీస్ గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలుచేయడంతో కాంగ్రెస్ పార్టీ 2016లో ఆయనను బహిష్కరించింది. దాంతో 2016లో జనతా కాంగ్రెసు చత్తీస్ గఢ్ పార్టీని అజిత్ జోగి స్థాపించారు. 1946లో జన్నించిన అజిత్ జోగి భోపాల్ లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్నారు. గోల్డ్ మెడలిస్టు అయిన ఆనయ కొన్నాళ్లపాటు రాయపూర్ లోని నిట్ లో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత సివిల్ పరీక్షలు రాసి ఐఎఎస్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు.