కూలిన అజిత్ కటౌట్.. గాయాలపాలైన ఫ్యాన్స్ !

కూలిన అజిత్ కటౌట్.. గాయాలపాలైన ఫ్యాన్స్ !

హీరో అజిత్ సినిమా విడుదల అంటే అభిమానులకు అదోక పెద్ద పండుగ.  సినిమా రిలీజవుతున్న థియేటర్ల వద్ద కటౌట్లు, బ్యానర్లు, బాణాసంచా వంటి ఏర్పాట్లతో భీభత్సమైన హడావుడి చేస్తుంటారు వారంతా.  కానీ ఒక్కోసారి వారి అత్యుత్సాహం, అజాగ్రత్త వలన ప్రమాదాలు కూడ సంభవిస్తుంటాయి.   విల్లుపురంలోని ఒక థియేర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కి పాలాభిషేకం చేయాలనే అత్యుత్సాహంతో అభిమానులు కొంతమంది ఒకేసారి కటౌట్ పైకి ఎక్కేశారు.  వారి బరవును తట్టుకోలేకపోయిన కటౌట్ రెప్పపాటులో కూలిపోయింది.  దీంతో అంత ఎత్తు నుంచి కింద పడిన వారంతా తీవ్ర గాయాలు తగిలి ఆసుపత్రి పాలయ్యారు.