నేతల నిర్బంధంపై అజిత్ దోవల్ ఏమన్నారంటే..!

నేతల నిర్బంధంపై అజిత్ దోవల్ ఏమన్నారంటే..!

ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్ నేతలను నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదని.. జమ్మూ కాశ్మీర్ లో ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సభలు సమావేశాలు పెడితే.. వాటిని ఉగ్రవాదులు అనువుగా మార్చుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని, అందుకే నేతలను నిర్బందించినట్టు అజిత్ దోవల్ తెలిపారు.  

ఇప్పటి వరకు ఎవరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదని, చట్టబద్ధంగానే గృహనిర్బంధం చేసినట్టు అయన తెలిపారు.  ఎవరికైనా అనుమానాలు ఉంటె కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.  109 జిల్లాల్లో కేవలం 10 చోట్ల మాత్రమే ఆంక్షలు అమలులో ఉన్నాయని అజిత్ దోవల్ పేర్కొన్నారు.  జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు గృహనిర్బంధం తప్పదని ఆయన పేర్కొన్నారు.