పోస్టర్ చిరిగినందుకు చంపేస్తారట !

పోస్టర్ చిరిగినందుకు చంపేస్తారట !

స్టార్ హీరోల అభిమానుల అభిమానం ఒక్కోసారి తారాస్థాయికి చేరి చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. ఇప్పటికే ఫ్యాన్స్ మూలాన అనేక సమస్యలు తలెత్తగా తాజాగా తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్ మూలాన పెద్ద సమస్యే వచ్చిపడింది.  అజిత్ కొత్త సినిమా 'విశ్వాసం' ఈ నెల 10న విడుదలకానుంది.  దీంతో 10 రోజుల ముందు నుండే ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు.  థేని జిల్లాలోని కొడువిలర్పట్ గ్రామంలోని అజిత్ అభిమానులు భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.  వాటిలో ఒక పోస్టర్ ను ఎవరో చింపేశారు.  దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ పోస్టర్ అతికించిన ఇంటి యజమాని జయమణిని చంపుతామని బెదిరింపులకు దిగారు.  దీంతో జయమణి పోలీసులను ఆశ్రయించారు.