లేడీ ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ సినిమా..!!

లేడీ ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ సినిమా..!!

తమిళనాడులో అజిత్, రజినీకాంత్ కు ఫ్యాన్స్ ఎక్కువ.  ముఖ్యంగా మాస్ లో ఈ హీరోలకు ఫాలోయింగ్ అధికం.  అజిత్ యూత్ హీరో కావడంతో ఇప్పటి తరంలో ఆయనకు లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.  విశ్వాసం సినిమాను లేడీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడం కోసం తిరునీవుర్ పట్టణంలోని థియేటర్ యాజమాన్యం రెడీ అవుతున్నది.  ఈ ప్రాంతంలో అజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.  ఇక్కడే లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.  వారికోసమే ఇక్కడ ఓ థియేటర్లో విశ్వాసం సినిమా ప్రదర్శించబోతున్నారు.  ఈ స్పెషల్ షో ఒక్కఆట మాత్రమే ఉంటుందా.. ఒక్కరోజు ఉంటుందా లేదంటే కంటిన్యూగా వారికోసమే ఆ థియేటర్ కేటాయిస్తారా అన్నది తెలియాలి.