ప్రభాస్ ను సర్ప్రైజ్ చేసిన అజిత్..!!

ప్రభాస్ ను సర్ప్రైజ్ చేసిన అజిత్..!!

బాహుబలి తరువాత ప్రభాస్ పేరు ఇండియా మొత్తం మారుమ్రోగిపోతున్నది.  ప్రభాస్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, ప్రభాస్ ప్రస్తుతం  సాహో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  దాదాపు రూ.300కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ.  బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్.  

సాహో సెట్స్ కు అనుకోని అతిధి వచ్చి ప్రభాస్ ను సర్ప్రైజ్ చేశాడు.  అతను ఎవరో కాదు... విశ్వాసం సినిమాతో భారీ హిట్ కొట్టిన అజిత్.  బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.  ఈ సినిమాలో అజిత్ హీరో.  ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది.  ప్రభాస్, అజిత్ సినిమాలు పక్కపక్క సెట్స్ లో జరుగుతుండటంతో.. అజిత్ క్యాజువల్ గా వెళ్లి ప్రభాస్ ను కలిశారు.  దాదాపు గంటపాటు ఇద్దరు మాట్లాడుకున్నారు.  దీనికి సంబంధించిన విషయాలను, ఫోటోలను సాహో టీమ్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.