రజినీతో ఢీ అంటే ఢీ అంటున్న అజిత్ !

రజినీతో ఢీ అంటే ఢీ అంటున్న అజిత్ !

సూపర్ స్టార్ రజనీకాంత్, కార్తిక్ సుబ్బరాజుల 'పెట్ట' చిత్రం వాచ్ ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న   సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి పోటీగా మరొక స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 'విశ్వాసం' కూడ సంక్రాతి బరిలో నిలిచింది.  దీంతో సంకనార్టి పోటీ రసవత్తరంగా మారింది.   ముందుగా ఈసినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వలన వాయిదా వేయడం జరిగింది. 

ఈ వాయిదాను ఇకపై మార్చేది లేదని, సంక్రాంతికి సినిమా ఖాయమని నిర్మాతలు అంటున్నారు.  శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది.  ఇందులో అజిత్ కు జోడీగా నయనతార నటిస్తోంది.