ఒకే రోజు పోటీకి దిగుతున్న విజయ్, అజిత్ !

ఒకే రోజు పోటీకి దిగుతున్న విజయ్, అజిత్ !

తమిళనాట ఇద్దరు సూపర్ స్టార్లు విజయ్, అజిత్.  వీరి సినిమాల నడుమ ఎప్పుడూ పోటీ నడుస్తూనే ఉంటుంది.  త్వరలో మరోసారి వీరిరువురూ పోటీకి దిగబోతున్నారు.   అజిత్, శివ దర్శకత్వంలో    చేస్తున్న 'విశ్వాసం' సినిమా యొక్క ఫస్ట్ లుక్ వినాయకచవితి సందర్బంగా సెప్టెంబర్ 13న విడుదలకానుంది. 

అదే రోజున మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ చేస్తున్న 'సర్కార్' సినిమా టీజర్ సైతం విడుదలకానుంది.  ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజున పోటీకి దిగుతుండటంతో కోలీవుడ్లో వినాయకచవితి రసవత్తరంగా మారింది.  ఇక సోషల్ మీడియా హడావుడి అయితే చెప్పనక్కర్లేదు.  ఇరువురి అభిమానులు ఓ రేంజులో ఢీ కొనడం ఖాయం.